Tirumala: తిరుమల మాడవీధుల్లో పందుల మంద... భక్తులు విస్తుపోయేలా చేస్తున్న చిత్రం!
- శ్రీవారి ఆలయం ముందు వరాహాల గుంపు
- బేడీ ఆంజనేయుని ఆలయం నుంచి మెట్లు దిగి పరుగులు
- పరుగులు పెట్టిన భక్తులు
ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంద తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించకపోవడం భక్తులను విస్తుపోయేలా చేసింది. ఏడు పందుల మంద, బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి, ఆయన ముందు వరకూ వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలోకి పరుగులు పెట్టాయి.
తిరువీధుల పవిత్రత పేరిట, పాదరక్షలతో భక్తుల సంచారాన్ని నిషేధించిన టీటీడీ, తన నిఘా విభాగాన్ని మాత్రం పందుల విషయంలో అలర్ట్ చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. పందులను చూసి భక్తులు పరుగులు పెట్టారు. తిరుమలలో పందులను నియంత్రించాలని గతంలో ఈఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.