Hyderabad: అమీర్ పేట మెట్రో స్టేషనులో బాంబు పెట్టామని పోలీసులకు ఫోన్... ఉరుకులు, పరుగులు!

  • గత వారం ప్రారంభమైన ప్రజా రవాణా వ్యవస్థ
  • బాంబులు పెట్టినట్టు ఆగంతకుడి ఫోన్
  • రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థగా గతవారం ప్రారంభమైన మెట్రో రైలును సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు ఆసక్తిని చూపుతున్న వేళ, అమీర్ పేటలోని మెట్రో రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్టు కొద్దిసేపటి క్రితం పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు, భారీ సంఖ్యలో ఉన్న ప్రయాణికుల మధ్యే బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తనిఖీలు చేస్తున్నామని, ఇది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అయ్యుంటుందని భావిస్తూనే, ముందు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, నేడు కూడా మెట్రో రైలును ఎక్కేందుకు ఒక్కో స్టేషన్ కు వేలాదిగా ప్రజలు చేరుకుంటున్నారు. ప్రతి రైలూ కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News