shalini pandey: 'ప్రీతి'గా మాత్రమే 'అర్జున్ రెడ్డికి' లిప్ కిస్: హీరోయిన్ షాలినీ పాండే

  • 'అర్జున్ రెడ్డి'తో సూపర్ హిట్ కొట్టిన షాలినీ పాండే
  • ఎంతో ప్యాషన్ తో కిస్ సీన్స్ చేశాను
  • సినిమాలో అవి ఎమోషన్ సీన్స్ మాత్రమే
  • కథ డిమాండ్ చేస్తే బికినీకి సిద్ధం 

తాను నటించిన తొలి మూవీ 'అర్జున్ రెడ్డి'తో సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలు సొంతం చేసుకున్న షాలినీ పాండే, ఆ సినిమాలో లిప్ కిస్ సీన్లపై స్పందించింది. ప్రస్తుతం '100% లవ్' తమిళ రీమేక్ లో నటిస్తున్న ఆమె, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనకు ప్రేమ అనుభవం ఇంతవరకూ కలగలేదని, 'ప్రీతి' క్యారెక్టర్ లో భాగంగానే 'అర్జున్ రెడ్డి'కి లిప్ కిస్ ఇచ్చానే తప్ప, అక్కడ తనకు విజయ్ దేవరకొండ కనిపించలేదని చెప్పుకొచ్చింది.

మిగతా అమ్మాయిలతో పోలిస్తే, తాను కొంచెం తేడా అని, తనను మరబొమ్మగా అబ్బాయిలు భావిస్తుంటారని చెప్పుకున్న షాలినీ, 'అర్జున్ రెడ్డి'లో ఎంతో ప్యాషన్ తో కిస్ సీన్స్ చేశానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే, బికినీలు ధరించేందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పిన ఈ భామ, నవ్వు, ఏడుపు మాదిరిగానే ముద్దు పెట్టుకోవడం అన్నది ఓ ఎమోషన్ అని, దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తుండటం గమనార్హం. తమిళ '100% లవ్' కోసం బరువు తగ్గానని, భవిష్యత్తులో తాను చేయగలనని అనుకున్న పాత్రల్లోనే నటిస్తానని షాలిని అంటోంది.

shalini pandey
arjunreddy
vijay devarakonda
  • Loading...

More Telugu News