mahaboobnagar: బ‌స్సు ప్ర‌యాణికుడికి తుపాకీ, బుల్లెట్లు, బుర‌ఖా దొరికిన వైనం!

  • మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఘ‌ట‌న
  • హైదరాబాద్-నారాయణపేట్ బ‌స్సులో ప్ర‌యాణించిన వ్య‌క్తి
  • బ్యాగు మ‌ర్చిపోయి వెళ్లిన మ‌రో ప్ర‌యాణికుడు
  • త‌న‌కు దొరికిన వ‌స్తువుల‌ను పోలీసుల‌కు అప్ప‌జెప్పిన వ్య‌క్తి

బ‌స్సుల్లో, రైళ్ల‌లో, ఆటోల్లో కొంద‌రు ప‌ర్సులు ప‌డేసుకుని లేక బ్యాగులు మ‌ర్చిపోయి వెళ్తుంటారు. ఒక‌వేళ ఆ వ‌స్తువులు దొరికిన వ్య‌క్తి మంచివాడైతే వాటిని బాధ్య‌త‌తో పోలీసుల‌కు అప్ప‌జెప్పుతాడు. కాగా, ఓ వ్య‌క్తికి ఓ బ్యాగు దొర‌క‌గా అందులో ఏమున్నాయ‌ని చూశాడు. అందులో తుపాకీ ఉండ‌డంతో షాక్ అయ్యాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే, మహబూబ్‌నగర్‌లో బ‌స్సులో ప్ర‌యాణిస్తోన్న ఓ వ్య‌క్తికి ఎంఎం తుపాకి, ఐదు బుల్లెట్లు, ఓ బురఖా దొరికాయి. ఓ ప్ర‌యాణికుడు బ్యాగుని మ‌ర్చిపోయి వెళ్లాడ‌ని, అందులోనే ఇవి ఉన్నాయ‌ని తెలుపుతూ దాన్ని దేవరకద్ర పోలీసులకు అప్పజెప్పాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ బ‌స్సు హైదరాబాద్ నుంచి నారాయణపేట్ వెళుతోంద‌ని స‌మాచారం. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News