audo: కార్లపై 3 లక్షల నుంచి 8.85 లక్షల డిస్కౌంట్ ప్రకటించిన ఆడి

  • బంపర్ ఆఫర్లు ప్రకటించిన ఇండియా ఆడి కార్ల సంస్థ
  • ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో ఆఫర్లు
  • భారీ తగ్గింపుతో పాటు చెల్లింపులపై కూడా ఆఫర్

 ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడి నాలుగు రకాల కార్లపై ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 ఎస్యూవీ కార్లపై 3 లక్షల రూపాయల నుంచి 8.85 లక్షల రూపాయల వరకు డిస్కౌండ్ ఆఫర్ ను ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ భారతీయ కస్టమర్లకు మాత్రమేనని ప్రకటించింది.

ఈ ఆఫర్ లో డిస్కౌంట్ అనంతరం ఆడి ఏ3 కారు 26.99 లక్షల రూపాయలకు లభ్యం అవుతుండగా, ఆడి ఏ4 కారు 33.99 లక్షల రూపాయలకు దొరుకుతుంది. ఇక ఆడి ఏ6 కారైతే 44.99 లక్షలకే లభిస్తుందని, ఆడి క్యూ3 ఎస్యూవీ కారైతే 29.99 లక్షల రూపాయల ఎక్స్ షోరూం ధరకు అందుబాటులో ఉంటుందని ఆడి సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్ లో 2017లో ఆడి కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు 2019లో డబ్బు చెల్లించే వెలుసుబాటు కూడా కల్పిస్తున్నామని ఆడి ఇండియా ప్రకటించింది. అయితే పరిమిత కాలంలోనే ఈ చెల్లింపులు చేయాలని స్పష్టం చేసింది. దీంతో భారత్ లో కస్టమర్లను భారీ ఎత్తున తమవైపు తిప్పుకోగలుగుతామని ఆడి అంచనా వేస్తోంది. 

audo
audi cars
audi india
germany
  • Loading...

More Telugu News