r krushnayya: అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తా: ఆర్ కృష్ణయ్య

  • ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నా
  • కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది
  • దీనిపై న్యాయపోరాటం చేస్తా

బీసీ (ఎఫ్) గా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ పోరాటం కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. కాగా, మంజునాథ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా కాపులను బీసీ (ఎఫ్) గా పేర్కొంటూ 5 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే. 

r krushnayya
warning
warns on kapu reservations
  • Loading...

More Telugu News