simbu: నేనెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు: వివాదంపై శింబు

  • ఏఏఏ సినిమా విమర్శలపై స్పందించిన శింబు 
  • మైఖేల్ రాయప్పన్ విమర్శలపై నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నాకెలాంటి రెడ్ కార్డ్ నోటీసు అందలేదు

హీరో శింబు కారణంగా ‘అన్బనవన్‌ అసరధవన్‌ అదంగధవన్‌’ (ఏఏఏ) సినిమా తీసి నష్టపోయానని చెబుతూ ఆ సినిమా నిర్మాత మైఖేల్ రాయప్పన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శింబు స్పందించాడు. ఈ వివాదంపై ఆయన మాట్లాడుతూ, ‘నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నుంచి నాకెలాంటి రెడ్‌ కార్డ్‌ (నిర్మాత చేసిన ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకూ మరో సినిమాలో నటించేందుకు అవకాశం లేకుండా నిరోధించడం) నోటీసు అందలేదు. ఒకవేళ నోటీసు వస్తే దానిని ఎలా హ్యాండిల్‌ చేయాలో నాకు బాగా తెలుసు. నిర్మాత రాయప్పన్‌ ఇంకా నాకు పారితోషికం చెల్లించాల్సి ఉంది. దీనిపై నేను ఇప్పటికే నడిఘర్‌ సంఘంలో ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. 

simbu
controversy
no comment
  • Loading...

More Telugu News