rajanikanth: 'కాలా' సినిమా విడుదలకి ముహూర్తం ఖరారు

  • రజనీ .. రంజిత్ కాంబినేషన్లో 'కాలా'
  • పవర్ఫుల్ డాన్ గా రజనీకాంత్ 
  • ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు 

రజనీకాంత్ .. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన 'కబాలి' భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో రజనీని కొత్తగా చూపించి రంజిత్ మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో ఆ తరువాత సినిమాను కూడా రజనీతోనే చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'కాలా' సినిమా రూపొందుతోంది. హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై, అందరిలోను ఆసక్తి వుంది.

పవర్ ఫుల్ డాన్ గా రజనీకాంత్ కనిపించనున్న ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారనేది తాజా సమాచారం. రజనీ - శంకర్ కాంబినేషన్లో రూపొందిన '2.0' జనవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన వేసవికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 'కాలా' ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.       

  • Loading...

More Telugu News