airport: విమానాశ్రయంలో పైల‌ట్ కోసం ఏడు గంట‌ల‌పాటు ఎదురుచూసిన 200 మంది ప్ర‌యాణికులు!

  • ముంబ‌యిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ఘ‌ట‌న‌
  • ఏడు గంట‌లు ఆల‌స్యంగా వ‌చ్చిన పైల‌ట్‌
  • ఆందోళ‌న‌కు దిగిన ప్ర‌యాణికులు

ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 మంది ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు దిగారు. ఆ విమానాశ్ర‌యం నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ రోజు తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉండ‌గా, దాదాపు ఏడు గంట‌ల పాటు టేకాఫ్ కాలేదు. పైలట్‌ లేకపోవడ‌మే ఇందుకు కార‌ణం. దీంతో ప్ర‌యాణికులు ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

విమానం ఆల‌స్యం అయినందుకు త‌మ‌కు కనీస సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌లేద‌ని, ఆహారం కూడా ఇవ్వలేద‌ని అన్నారు. విమానం గంట ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పార‌ని, ఆ త‌రువాత‌ పైలట్ లేడ‌ని చెప్పార‌ని ప్ర‌యాణికులు మండిప‌డ్డారు. చివ‌ర‌కు ఉదయం 9 గంటల సమయంలో పైలట్ వ‌చ్చాడు. దీంతో విమానం అహ్మదాబాద్ వెళ్లింది.     

  • Loading...

More Telugu News