surya: బాలకృష్ణతో పోటీకి దిగుతోన్న సూర్య

  • సూర్య 'గ్యాంగ్' ఫస్టులుక్ 
  • జనవరి 12న విడుదల 
  • అదే రోజున బాలకృష్ణ 'జై సింహా' రిలీజ్ 
  • గట్టిపోటీనే ఎదుర్కోనున్న సూర్య    

తమిళంలో సూర్య హీరోగా 'తానా సెరిందా కూట్టమ్' తెరకెక్కింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, తమిళంతో పాటుగా తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'గ్యాంగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా తెలియపరుస్తూ .. ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

సంక్రాంతి పండుగకి ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. అయితే ఆ సమయంలో బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ సినిమాలు ఉండటంతో వాయిదా పడుతుందని అనుకున్నారు. కానీ సూర్య సినిమా ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా రిలీజ్ డేట్ ను ఇచ్చేశారు. తమిళంతో పాటుగా తెలుగులోనూ జనవరి 12న విడుదల చేస్తున్నారు. గట్టిపోటీలో ఈ సినిమా రంగంలోకి దిగుతుండటం విశేషం.  

  • Loading...

More Telugu News