Chandrababu: కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నన్నెవరూ అడగలేదు.. బీసీలే టీడీపీకి వెన్నెముక: అసెంబ్లీలో చంద్రబాబు

  • కాపులకు న్యాయం చేయాలనేదే నా ఆలోచన
  • ఇతర బీసీలకు అన్యాయం జరగదు
  • రాష్ట్ర జనాభాలో కాపు, బలిజ, తెలగ, ఒంటరిలది 11 శాతం

తమకు రిజర్వేషన్లు కల్పించాలని కాపులెవరూ తనను అడగలేదని... అయితే ఆ సామాజికవర్గంలో ఉన్న ఇబ్బందులను చూసి తానే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాపులకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ హామీ ఇచ్చానని చెప్పారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర జనాభాలో కాపులు 8.72 శాతం ఉన్నారని తెలిపారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలన్నీ కలిపి 11 శాతం ఉన్నారని చెప్పారు.  బ్రిటీష్ కాలంలో కాపులకు రిజర్వేషన్ ఉండేదని... ఏపీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రిజర్వేషన్లను తొలగించారని తెలిపారు. 2016లో కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేశామని చెప్పారు.

ఇతర బీసీలకు అన్యాయం జరగకుండా కొత్తగా 'బీసీ ఎఫ్' ను ఏర్పాటు చేస్తున్నామని... 4 నుంచి 5 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని కమిషన్ సూచించగా, 5 శాతానికే మొగ్గు చూపామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు. 

  • Loading...

More Telugu News