North Korea: ఉత్తర కొరియా తాజా క్షిపణి వెరీ డేంజరస్.. అమెరికాలో ఏ సిటీనైనా భస్మం చేయగలదంటున్న నిపుణులు!

  • 13 వేల కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగల హ్వాసాంగ్-15
  • వెయ్యి కిలోల పేలోడ్ ను మోసుకుపోగలదు
  • అమెరికా భూభాగాన్నంతా చేరుకోగలదు

ఆధునిక క్షిపణి సాంకేతికతను సాధించడంలో ఉత్తర కొరియా సక్సెస్ అయింది. గురువారంనాడు ఆ దేశం ప్రయోగించిన హ్వాసాంగ్-15 అణు క్షిపణి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా ఆ దేశంలోని ప్రతి నగరాన్ని నాశనం చేయగలదట. ఇదే విషయాన్ని రక్షణ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మధ్యకాలం నాటికి సుదూర లక్ష్యాలను చేరుకోగల క్షిపణులను ఉత్తర కొరియా తయారు చేస్తుందని అంటున్నారు.

హ్వాసాంగ్-15 దాదాపు 13 వేల కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదని దక్షిణ కొరియా రక్షణ శాఖ తన నివేదికలో పేర్కొంది. ఇంతకు ముందు ప్రయోగించిన హ్వాసాంగ్-14 కంటే ఇది శక్తిమంతమైనదని నివేదికలో వెల్లడించింది. వెయ్యి కిలోల పేలోడ్ తో అమెరికాలోని ప్రధాన భూభాగాన్నంతా ఈ మిస్సైల్ చేరుకోగలదని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. 

  • Loading...

More Telugu News