india vs sri lanka test: ఢిల్లీ టెస్ట్: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • స్వీప్ చేసి, డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లో దొరికిపోయిన ధావన్
  • 23 పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్
  • భారత స్కోరు: 51/1

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ ఔట్ అయ్యాడు. దిల్ రువాన్ పెరీరా వేసిన బంతిని ధావన్ స్వీప్ చేయగా... అది డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ దిశగా గాల్లోకి లేచింది. లక్మల్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దిల్ రువాన్ కు ఇది 100వ టెస్ట్ వికెట్ కావడం గమనార్హం. మరోవైపు, అంపైర్ డ్రింక్స్ బ్రేక్ ప్రకటించాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 51 పరుగులు. మురళీ విజయ్ (26), పుజారా (1) క్రీజులో ఉన్నారు. 

india vs sri lanka test
3rd test
team india
sikhar dhawan
  • Loading...

More Telugu News