shahid kapoor: పెళ్లి తర్వాత నా కుటుంబ జీవితం సంతోషంగా ఉంది: షాహిద్ కపూర్

  • నా భార్య రూపంలో మంచి స్నేహితురాలు దొరికింది
  • పద్మావతి సినిమా ప్రత్యేకమైనది
  • రణవీర్ అద్భుతంగా నటించాడు

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ కు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. తన స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం అతనికి అలవాటు. అయితే, పెళ్లి అనంతరం అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా షాహిదే చెప్పాడు. తన భార్య మీరా రూపంలో ఇంటి వద్ద ఉత్తమ స్నేహితురాలు లభించిందని తెలిపాడు.

 మీరాను పెళ్లాడిన తర్వాత తన కుటుంబ జీవితం చాలా సంతోషంగా గడచిపోతోందని చెప్పాడు. తన సినిమాలకు తన భార్యే అతి పెద్ద విమర్శకురాలని అన్నాడు. తన తాజా చిత్రం 'పద్మావతి' చాలా ప్రత్యేకమైనదని... ఆ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉందని చెప్పాడు. సినిమాలో రణవీర్ అద్భుతంగా నటించాడని కితాబిచ్చాడు. 

shahid kapoor
meera rajput
padmavati
  • Loading...

More Telugu News