imaan mazari: నెత్తురోడిన పాకిస్థాన్.. సైన్యంపై మండిపడ్డ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేత కుమార్తె

  • పెషావర్ లో ఉగ్రదాడి
  • 12 మంది మృతి
  • సైన్యం తీరుపై మండిపడ్డ ఇమాన్ మజారీ

పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రక్తపుటేరులు పారించారు. బురఖాలు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు పెషావర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంపై మెరుపుదాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ ప్రకటించింది. మృతులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన అనంతరం ప్రముఖ రాజకీయ నేత తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ పాక్ సైన్యంపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం పట్ల సైన్యం సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు నిధులు అందిస్తున్న ఆర్మీ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే, చివరకు పాకిస్థానే నాశనం అవుతుందనే విషయం ఇప్పటికీ సైన్యానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆమె తండ్రి ఖండించడం గమనార్హం.

  • Loading...

More Telugu News