అమృత.. జయలలిత కూతురే.. శోభన్ బాబు కూడా చెప్పారు!: స్పష్టం చేసిన జయలలిత స్నేహితురాలు గీత
- శోభన్‌బాబుకు, జయలలితకు ఆమె జన్మించింది
- ఈ విషయాన్ని శోభన్‌బాబు నాతో చెప్పారు
- డీఎన్ఏ పరీక్షల్లోనే అసలు విషయం తేలుతుందన్న గీత
1999లో తానోసారి శోభన్‌బాబు ఇంటికి వెళ్లినప్పుడు తనకో కుమార్తె ఉన్న విషయాన్ని శోభన్ బాబు తనతో ప్రస్తావించారని, ఆమె పేరు అమృత అని చెప్పారని గీత గుర్తు చేసుకున్నారు. 1996 నుంచి జయలలితతో అమృతకు సంబంధాలు ఉండేవన్నారు. అమృత.. జయలలిత కూతురా? కాదా? అన్న విషయం డీఎన్ఏ పరీక్షల్లోనే తేలుతుందని, అప్పటి వరకు వేచి చూడాలని గీత పేర్కొన్నారు.