Uttar Pradesh: యూపీ స్థానిక సంస్థల ఎన్నికలు: భాజపా ఘనవిజయం.. నేతల హర్షం!

  • యూపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం
  • 652 పురపాలక స్థానాలకు జరిగిన ఎన్నికలు
  • 16 మేయర్ స్థానాల్లో 14 చోట్ల ఎగిరిన బీజేపీ జెండా

ఉత్తరప్రదేశ్‌ లో అధికారం చేపట్టిన అనంతరం ఎదురైన తొలి పరీక్షలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అద్భుత విజయం సాధించి, తన ఎంపిక గాలివాటం కాదని నిరూపించారు. యూపీలో మూడు విడతల్లో నవంబర్‌ 22, 26, 29న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ జరిగింది. వాటి ఫలితాలు ఈ రోజు వెల్లడవుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు.

652 పురపాలక స్థానాల్లో 16 మేయర్‌, 198 నగరపాలక పరిషత్‌ లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. 16 మేయర్‌ స్థానాల్లో 14 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. వారణాసి, అయోధ్య, లక్నో, గోరఖ్‌ పూర్‌, ఘజియాబాద్‌, బరేలీ, ఆగ్రా, ఫిరోజ్‌ బాద్‌, మథుర, కాన్పూర్‌, సహారాన్‌ పూర్‌, అలహాబాద్‌, మోరాబాద్‌, ఝాన్సీ నగరపాలక సంస్థలను బీజేపీ సొంతం చేసుకోగా, మీరట్‌, అలీగఢ్‌ లలో బీఎస్పీ విజయం సాధించింది. ఇంకా లెక్కింపు జరుగుతోంది. తాజా ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News