sreenivas gowd: బీజేపీని బీసీలు నమ్మరు: శ్రీనివాసగౌడ్

  • బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు
  • బీసీల సభను బీజేపీ నిర్వహించడం విడ్డూరంగా ఉంది
  • 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది

బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ తో పోలిస్తే తెలంగాణలోనే బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పారు. బీజేపీని బీసీలు నమ్మరని అన్నారు. గణాంకాలు కూడా చూసుకోకుండా బీసీల మహాసంగ్రామం పేరుతో బీజేపీ సభను నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 2019లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. 

sreenivas gowd
bjp
TRS
  • Loading...

More Telugu News