Chandrababu: దక్షిణ కొరియా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు

  • మూడు రోజుల పర్యటన
  • సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటించనున్న సీఎం
  • కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లనున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆయన దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సియోల్, బుసాన్ నగరాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ ను సందర్శించనున్నారు. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. దీనికితోడు, కృష్ణపట్నం పోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించి జరిగే బిజినెస్ సెమినార్ లో ఆయన పాల్గొంటారు. అంతేకాదు, అనంతపురం జిల్లాలో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు సంబంధించి 4వ తేదీన ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీ ఈడీబీ ఒప్పందం చేసుకోనుందని ప్రభాకర్ తెలిపారు.

Chandrababu
south korea
chandrababu north korea tour
  • Loading...

More Telugu News