vishal: ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలో హీరో విశాల్?

  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న విశాల్
  • సొంత పార్టీ పెట్టనున్న తెలుగు హీరో
  • 2021 ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో పోటీ

తెలుగువాడైన హీరో విశాల్ తమిళనాట సంచలనాలకు కేంద్రబిందువుగా మారాడు. ఇప్పటికే తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. తమిళనాడులో ఎలాంటి సామాజిక సమస్య తలెత్తినా వెంటనే స్పందిస్తున్నాడు. తాజాగా, విశాల్ గురించి ఓ సంచలన వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడమే కాక, ఆర్కే నగర్ ఉపఎన్నికలో విశాల్ పోటీ చేయబోతున్నట్టు తమిళ మీడియా చెబుతోంది.

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు 27 నామినేషన్లు దాఖలయ్యాయి. విశాల్ ఎంట్రీ ఇస్తే ఎన్నిక పోరు రసకందాయంలో పడుతుంది. మరోవైపు 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై విశాల్ దృష్టి సారించినట్టు సమాచారం. సొంత పార్టీని నెలకొల్పి మొత్తం 234 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. 

vishal
rk nagar election
vishal contests in rk nagar
  • Loading...

More Telugu News