prapancha telugu mahila sabhalu: చంద్రబాబును కూడా ఆహ్వానిద్దాం: కేసీఆర్

  • 15వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
  • చంద్రబాబును ఆహ్వానిద్దామన్న కేసీఆర్
  • ప్రారంభ వేడుకకు వెంకయ్య, ముగింపు వేడుకకు కోవింద్

డిసెంబర్ 15వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న జరిగిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ, అందరు ప్రముఖులతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆహ్వానిద్దామని చెప్పారు.

ప్రారంభ వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు హాజరవుతారని తెలిపారు. మారిషస్ వైస్ ప్రెసిడెంట్ పరమ శివన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ప్రారంభ వేడుకకు హాజరవుతారని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.

prapancha telugu mahila sabhalu
kcr
Chandrababu
  • Loading...

More Telugu News