simbu: శింబు పేరెత్తితేనే హీరోయిన్స్ పారిపోతున్నారు: నిర్మాత మైఖేల్ రాయప్పన్ ఆరోపణలు

  • శింబు ప్రవర్తన బాగోలేదు 
  • ఆయనతో నటించడానికి హీరోయిన్స్ ఒప్పుకోవడం లేదు 
  • తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేస్తున్నారు 
  • నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాను    

శింబు హీరోగా 'అంబనవన్ .. ఆసరాథవన్ .. అదంగథవన్' అనే సినిమాను మైఖేల్ రాయప్పన్ నిర్మించారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో తమని శింబు నానా ఇబ్బందులు పెట్టేశాడంటూ ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. "శింబులాంటి అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ వున్న వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. శింబు ప్రవర్తన చాలా దారుణంగా తయారైంది .. తానో పెద్ద హీరోనని పోజు కొడుతూ ఉంటాడు .. షూటింగ్ ప్లానింగ్ ను ఇష్టానుసారంగా మార్చేస్తూ ఉంటాడు" అని అన్నాడు.

 "శింబు ధోరణి కారణంగా ఆయన సరసన నటించడానికి ఏ హీరోయిన్ ఒప్పుకోవడం లేదు .. ఆయన పేరెత్తితేనే పారిపోతున్నారు. ముందుగా త్రిష .. ఆ తరువాత లక్ష్మీ మీనన్ తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశారు. ఆ సమయంలో శ్రియను తీసుకుంటే వద్దంటూ శింబు గొడవపెట్టాడు. దాంతో ఆమె కాంబినేషన్లోని పాటను షూట్ చేయలేకపోయాము. తనని ప్రశ్నించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ను తొలగించమంటూ వత్తిడి చేశాడు. ఆయనపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాం .. చర్యలు తీసుకునే ఆలోచనలో మండలి వుంది" అని చెప్పుకొచ్చారు.   

simbu
shriya
  • Loading...

More Telugu News