somireddy chandra mohan reddy: కేంద్ర ప్ర‌భుత్వం ఉదారంగా వ్యవహరించాలి: పోల‌వ‌రంపై మ‌ంత్రి సోమిరెడ్డి

  • కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
  • పోల‌వ‌రం పూర్తి చేస్తే న‌రేంద్ర‌ మోదీ ప్రతిష్ఠ మ‌రింత పెరుగుతుంది
  • ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే నిధుల‌ అంచ‌నా భారీగా పెరిగింది

పోలవరం ప్రాజెక్టుపై జ‌రుగుతోన్న‌ పరిణామాలపై అగ్గి రాజుకుంది. అత్యంత‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం త‌మ‌కు రాసిన లేఖ ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర‌ అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్ర‌భుత్వం ఉదారంగా వ్యవహరించాలని ఆయ‌న కోరారు.

ఏపీ ప్రయోజనాల విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వంపై తాము ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ ప్రతిష్ఠ మ‌రింత పెరుగుతుంద‌ని చెప్పారు. ఆ ప్రాజెక్టు ఆల‌స్యం కావ‌డం వ‌ల్లే నిధుల‌ అంచ‌నా భారీగా పెరిగింద‌ని తెలిపారు.

somireddy chandra mohan reddy
polavaram
project
  • Loading...

More Telugu News