upasana: 'చిరు' ఫిల్టర్ కాఫీ.. తాగండి బాబూ అంటున్న ఉపాసన!

  • కాఫీ షాప్ ప్రారంభించిన ఉపాసన
  • తన మామయ్య పేరుతో ఫిల్టర్ కాఫీ
  • కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వాలంటూ ఆహ్వానం

హీరో, హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్ల పేర్లపై రెస్టారెంట్లను ప్రారంభించడం... వారి పేర్లతో ఆహార పదార్థాలను తయారు చేయడం మనకు తెలిసిన విషయమే. వారికున్న క్రేజ్ కస్టమర్లను రెస్టారెంట్లకు రప్పిస్తుంటుంది. తాజాగా, మెగాస్టార్ పేరిట ఓ ఫిల్టర్ కాఫీ మార్కెట్లోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, చిరంజీవి కోడలు ఉపాసన అపోలో ఫౌండేషన్ తరపున 'థియేటర్ కేఫ్' పేరిట ఓ కాఫీ షాప్ ను ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో షాప్ ప్రారంభమవుతోంది. జూబ్లీహిల్స్ లోని అపోలో ఎఫ్ఎన్డీ థియేటర్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ కేఫ్ కు వచ్చి రిలాక్స్ అవ్వండి' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ కేఫ్ లో చిరు ఫిల్టర్ కాఫీ, హైదరాబాదీ కేసర్ రోజ్ టీ, లుక్మి చికెన్/వెజ్, లామకాన్ వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీలు అందుబాటులో ఉంటాయి.
.

  • Error fetching data: Network response was not ok

More Telugu News