sai dharam tej: 'జవాన్'లో 'జై' పాత్రలో తేజు నటనకు ప్రశంసలు!

  • ఈ రోజే విడుదలైన 'జవాన్' 
  • 'జై' పాత్రలో సాయిధరమ్ తేజ్ 
  • తనదైన స్టైల్లో డాన్సులు .. ఫైట్లు  
  • ఆయన నటనకు ప్రశంసలు

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జవాన్' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సాయిధరమ్ తేజ్ నటన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో తేజు ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తగా .. 'జై' పాత్రలో కనిపిస్తాడు. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువగా వున్న 'జై' .. దేశాన్ని కాపాడటం కోసం బలమైన శత్రువులతో తలపడతాడు.

 దేశం కోసం ఎంతకైనా తెగించే 'జై' పాత్రలో తేజు ఒదిగిపోయాడని చెబుతున్నారు. కుటుంబం పట్ల తనకి గల ప్రేమాభిమానాలను .. దేశం పట్ల గల అంకితభావాన్ని ఆయన అద్భుతంగా ఆవిష్కరించాడని అంటున్నారు. ఆవేశం .. దూకుడు చూపించే సన్నివేశాల్లో తేజు జీవించాడనీ .. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలలో నటుడిగా పరిణతిని కనబరిచాడని చెబుతున్నారు. ఇక డాన్సులను .. ఫైట్లను తనదైన స్టైల్లో అదరగొట్టేశాడని కితాబునిస్తున్నారు

sai dharam tej
mehreen
  • Loading...

More Telugu News