secrateriat: సచివాలయం నమూనాకు బాబు ఓకే... కట్టిన తరువాత అమరావతి వీడియో ఎలా ఉంటుందో చూడండి!
- సచివాలయం, అసెంబ్లీ ఆకృతులకు ఆమోదం
- ప్రజల అభిప్రాయాన్ని కోరిన చంద్రబాబు
- డిజైన్లు అందించిన ఫాస్టర్ అండ్ పార్టనర్స్
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వం నిర్మించతలబెట్టిన సచివాలయం, అసెంబ్లీ శాశ్వత భవనాల ఆకృతులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. హైరైజ్ బిల్డింగ్ ల రూపంలో ఈ భవంతులు ఉంటాయి. డిజైన్లను ఓకే చేసిన చంద్రబాబు, తుది నిర్ణయం తీసుకునేముందు ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఫాస్టర్ అండ్ పార్టనర్స్ ఈ డిజైన్లను ఏపీ ప్రభుత్వానికి అందించింది. ఈ డిజైన్లను సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) అధికార వెబ్ సైట్ తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఉంచారు. వీటిని చూసి అభిప్రాయాలు చెప్పాలని ప్రభుత్వం కోరుతోంది. భవనాలు ఎలా ఉంటాయన్న వివరాలను, నిర్మాణం పూర్తయిన తరువాత ఏరియల్ వ్యూ దృశ్యాలను గ్రాఫికల్ వీడియో రూపంలో మీరూ చూడవచ్చు.