whatsapp: మరోసారి క్రాష్ అయిన వాట్సాప్!

  • ఈ ఉదయం క్రాష్ అయిన వాట్సాప్
  • ఉత్తర యూరప్, బ్రెజిల్ లో ఎక్కువ సమస్య
  • సమస్యను గుర్తించే పనిలో ఉన్నామన్న వాట్సాప్

మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరోసారి క్రాష్ అయింది. ఈ ఉదయం వాట్సాప్ పనిచేయలేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు ఫిర్యాదు చేశారు. యాప్ ను యాక్సెస్ చేసే క్రమంలో సమస్యలు తలెత్తినట్టు వారు పేర్కొన్నారు. వాట్సాప్ కు అంతరాయం కలగడం ఈ వారంలో ఇది రెండో సారి. నవంబర్ 3వ తేదీన కూడా వాట్సాప్ క్రాష్ అయింది.

ఈ రోజు దాదాపు గంట సమయం పాటు సర్వీసులు నిలిచిపోయాయని, ఆ తర్వాత సర్వీసుల పునరుద్ధరణ జరిగిందని యూజర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి #వాట్సాప్ డౌన్ అనే మెసేజ్ లు ట్విట్టర్లో వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఉత్తర యూరప్, బ్రెజిల్ లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధులు స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ యూజర్లు యాప్ ను యాక్సెస్ చేసుకోలేకపోతున్నారని... సమస్యను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News