Telangana DGP: తెలంగాణ డీజీపీకి యూఎస్ సీక్రెట్ సర్వీస్ లెటర్!

  • ఇవాంక పర్యటనను విజయవంతం చేశారు
  • పగలు, రాత్రి తేడా లేకుండా తెలంగాణ పోలీసుల కృషి
  • మరోసారి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాం
  • అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ లేఖ

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ హెడ్ రిచర్డ్ ఓ లేఖను రాశారు. తమ అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా చేశారని, పగలు, రాత్రుళ్లు ఎంతో ఓపికతో విరామం లేకుండా తెలంగాణ పోలీసులు విధులు నిర్వహించారని రిచర్డ్ ఈ లేఖలో పొగడ్తలు కురిపించారు. తెలంగాణ పోలీసుల సేవల పట్ల ఇవాంక సంతోషంగా ఉన్నారని చెప్పిన ఆయన, మీ వల్లే ఆమె పర్యటన విజయవంతం అయిందని తెలిపారు.

తనిఖీల పేరిట అతిథులను ఇబ్బంది పెట్టే అవసరం లేకుండా చూడటం తమకు నచ్చిందని, అసాధారణ రీతిలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని కితాబిచ్చారు. ఒకేరోజు రెండు కార్యక్రమాలు జరిగిన వేళ, తెలంగాణ పోలీసుల తీరు అద్భుతమని కొనియాడారు. పర్యటన షెడ్యూలు ఆసాంతం రహస్యంగా ఉంచి, చివరి క్షణాల్లో వివరాలు చెబుతున్నా, పోలీసులు సంయమనంతో అర్థం చేసుకుని విధులు నిర్వహించారని, మరోసారి తెలంగాణ పోలీసులతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తుంటామని తెలిపారు.

Telangana DGP
Mahender Reddy
Ivanka Trump
US Secret Service
  • Loading...

More Telugu News