pavan kalyan: మలయాళంలోకి 'అజ్ఞాతవాసి' .. అక్కడి ఆడియన్స్ ను ఆకర్షించేవి ఇవే!

  • మలయాళంలోను పవన్ కి క్రేజ్ 
  • అనిరుథ్ సంగీతమంటే వాళ్లకి ఇష్టం 
  • కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ మలయాళీ భామలే  

ఇతర భాషా చిత్రాలు తెలుగులోకి భారీ స్థాయిలో విడుదలవుతూ వుండటంతో, టాలీవుడ్ హీరోలు కూడా తెలుగుతో పాటు తమ సినిమాలు తమిళ .. మలయాళ భాషల్లో విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. అక్కడ తమ అభిమానుల సంఖ్యతో పాటు మార్కెట్ ను పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ విషయంలో అల్లు అర్జున్ ముందున్నాడు. ఇక 'జనతా గ్యారేజ్' తో ఎన్టీఆర్ కూడా మలయాళంలో మంచి మార్కులు కొట్టేశాడు.

 'కాటమ రాయుడు'తో పవన్ మలయాళంలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అందువలన 'అజ్ఞాతవాసి'ని కూడా మలయాళ వెర్షన్ లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. మలయాళంలోను పవన్ కి క్రేజ్ ఉండటం .. సంగీత దర్శకుడు అనిరుథ్ సంగీతాన్ని వాళ్లు ఎక్కువగా ఇష్టపడటం .. ఈ సినిమాలోని కథానాయికలు కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ కూడా మలయాళీ భామలు కావడం అక్కడ ఈ సినిమాకి బాగా కలిసొచ్చే అంశాలని అంటున్నారు. ఇక తెలుగుతో పాటు మలయాళంలోను ఈ సినిమా ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.         

pavan kalyan
keerthi suresh
anu immanuel
  • Loading...

More Telugu News