Raghava larence: వడ్డీతో సహా తిరిగిచ్చేశానంటున్న లారెన్స్ హీరోయిన్!

  • 'కాంచన-3' నుంచి తప్పుకున్న ఓవియా
  • నిర్మాతల మండలిలో ఫిర్యాదు
  • అడ్వాన్స్ డబ్బులను వడ్డీతో కలిపి ఇచ్చేశా
  • వివరణ ఇచ్చిన ఓవియా

ఓ సినిమాను అంగీకరించి, ఆపై ఏవో కారణాలతో హ్యాండిస్తున్న హీరోయిన్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ జాబితాలో హారర్ సిరీస్ 'కాంచన' మూడో భాగం హీరోయిన్ ఓవియా కూడా చేరిపోయింది. తమిళ బిగ్ బాస్ షోలో ఆమె చేసిన హంగామాతో పాప్యులారిటీ పెరుగగా, సినిమా అవకాశాలను వరుసగా చేజిక్కించుకుంటున్న ఈ భామ, 'కాంచన-3' షూటింగ్ ఆలస్యమవుతూ ఉండటంతో 'సారీ' చెబుతూ తప్పుకుందని తెలుస్తోంది.

 దీంతో ఓవియాపై సినీ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయగా, తాను తీసుకున్న అడ్వాన్సును వడ్డీతో సహా నిర్మాతలకు చెల్లించేశానని, తనకు ఇంకేమీ సంబంధం లేదని ఆమె మండలికి వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఓవియా చేతులు దులిపేసుకుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Raghava larence
Oviya
kanchana-3
  • Loading...

More Telugu News