ISL: 'ఇండియన్‌ సూపర్‌ లీగ్‌'లో అభిమానుల మధ్య ఘర్షణ.. వీడియో చూడండి

  • మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన పూణే లోని శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ 
  • ముంబై-పూణే మధ్య పోరాటం
  • బూతులు తిట్టుకున్న అభిమానులు

మ్యాచ్ లను వీక్షిస్తూ స్టేడియంలో అభిమానులు ఘర్షణకు దిగిన ఘటనలు విదేశాల్లో సర్వసాధారణం. కానీ భారత్ లో కూడా ఫుట్ బాల్ అభిమానులు అలాగే ఉద్రేకానికి లోనవుతారని నిరూపించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. 'ఇండియన్‌ సూపర్‌ లీగ్‌' ఫుట్ బాల్ మ్యాచ్ లలో భాగంగా పూణేలోని శ్రీ శివ్‌ ఛత్రపతి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లో ముంబై-పూణే మధ్య జరిగిన మ్యాచ్‌ లో రెండు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇది తీవ్రరూపం దాల్చడంతో రెండు వర్గాలుగా మారిన అభిమానులు ప్రత్యర్థి జట్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది పూణే అభిమానులను మరోచోటుకి తరలించడంతో వివాదం సద్దుమణిగింది.

ISL
FOOTBALL MATCH
fans fight
  • Error fetching data: Network response was not ok

More Telugu News