polavaram: చంద్రబాబుకి ఏదో వీక్ నెస్ పాయింట్ ఉంది: ఉండవల్లి అరుణ్ కుమార్

  • కేంద్రం వద్ద మెతకవైఖరికి కారణమేంటి?
  • కేంద్రంతో పోరాడితే వచ్చిన నష్టమేంటి?
  • విభజన హామీలు నెరవేర్చాలని, పోలవరం పూర్తి చేయాలని ఎందుకు అడగలేకపోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏదో వీక్ నెస్ పాయింట్ ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిధులపై నిర్వేదం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పుడు మెతకగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటని ఆయన అడిగారు.

కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు వీక్ నెస్ పాయింట్ ఏదో కేంద్రం వద్ద ఉన్నట్టు అనిపిస్తోందని ఆయన చెప్పారు. అందుకే పోలవరం పూర్తి చేయలేకపోతున్నాడని ఆయన ఆరోపించారు. విభజన హామీలు నెరవేర్చమని అడగడం ఆంధ్రులుగా మన హక్కని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశగా చంద్రబాబు పోరాడాలని ఆయన సూచించారు. 

polavaram
undavalli arun kumar
comments
  • Loading...

More Telugu News