jaleel khan: ఎమ్మెల్యేల ఆస్తులు అమ్మేసైనా పోలవరం పూర్తి చేస్తాం: జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు లక్ష్యం
  • పోలవరం కోసం జోలెపడతాం
  • ఎలాగైనా పూర్తి చేస్తాం 

ఎమ్మెల్యేల ఆస్తులు అమ్మి అయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలంతా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, విభిన్నంగా స్పందించిన జలీల్ ఖాన్ విజయవాడలో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబు లక్ష్యసాధనకు పోరాడుతామని ఆయన చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైతే బిచ్చమెత్తుతామని కూడా ఆయన అన్నారు. జోలెపట్టి నిధులు సేకరిస్తామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేసి తీరుతామని ఆయన అన్నారు.  

jaleel khan
contravesory comments
polavaram
  • Loading...

More Telugu News