manushi chillar: ప్ర‌ధాని మోదీని క‌లిసిన మిస్ వ‌ర‌ల్డ్ మానుషీ చిల్ల‌ర్‌!

  • కుటుంబంతో పాటు మోదీతో ఫొటోలు
  • ట్వీట్ చేసిన మానుషీ
  • కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మోదీ

ఇటీవ‌ల ప్ర‌పంచ సుంద‌రి కీరిటాన్ని సొంతం చేసుకున్న అందాలభామ మానుషీ చిల్ల‌ర్‌, ఇవాళ మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని క‌లిశారు. త‌ల్లిదండ్రులతో క‌లిసి ఆమె ప్ర‌ధానిని క‌ల‌వ‌డానికి వెళ్లారు. అంతకుముందు మానుషీ ట్వీట్ చేస్తూ, తాను చాలా ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నానంటూ చెప్పింది.

'ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌బోతున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఆయ‌న అంద‌రికీ ఆద‌ర్శం' అంటూ ట్వీట్ చేసింది. 17 ఏళ్ల త‌ర్వాత భార‌త దేశానికి ప్ర‌పంచ సుంద‌రి కీరిటాన్ని తీసుకువ‌చ్చినందుకు ప్ర‌ధాని మోదీ, మానుషీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ట్లు స‌మాచారం.

manushi chillar
Narendra Modi
met
miss world
  • Loading...

More Telugu News