datally: డేటా సేవ్ చేసేందుకో ప్రత్యేక యాప్... విడుదల చేసిన గూగుల్!
- గూగుల్ డేటాల్లీ పేరుతో ఆవిష్కరణ
- డేటా ఎక్కువ వాడుతున్న యాప్‌ల కట్టడి
- వైఫై నెట్‌వర్క్‌ల నాణ్యతను కూడా తెలిపే డేటాల్లీ
వినియోగదారుడికి తెలియకుండానే కొన్ని సార్లు డేటా అయిపోతుంటుంది. ఏం వాడకపోయినప్పటికీ కొన్ని యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను వినియోగించుకుంటుంటాయి. దీన్ని కట్టడి చేయడానికి గూగుల్ ప్రత్యేకంగా ఒక యాప్‌ను ఆవిష్కరించింది. 'డేటాల్లీ' అనే పేరుతో ఉన్న ఈ యాప్ ద్వారా డేటా ఎక్కువ వాడుతున్న యాప్‌లను కట్టడి చేయవచ్చు.
ప్రస్తుతం ఈ యాప్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌కి అందుబాటులో ఉంది. డేటాల్లీ యాప్ ద్వారా ఏ యాప్ ఎంత డేటా వినియోగించుకుంటోందో తెలుసుకుని, ఆ వాడకాన్ని నియంత్రించవచ్చు. దీని ద్వారా దాదాపు 30 శాతం మొబైల్ డేటాను సేవ్ చేసే సదుపాయం కలుగుతుంది. అలాగే ఈ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న వైఫై నెట్‌వర్క్‌లను కనిపెట్టవచ్చు. అందులో నాణ్యమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించే నెట్‌వర్క్‌లను ఈ యాప్ ద్వారా ఎంచుకోవచ్చు.