gujarat elections: గుజరాత్ బీజేపీదే.. కాంగ్రెస్ కు పరాభవమే.. తేల్చేసిన బెట్టింగ్ మార్కెట్లు

  • గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై భారీ బెట్టింగ్ లు
  • బీజేపీదే గెలుపంటున్న బెట్టింగ్ మార్కెట్
  • బీజేపీ గెలుపుపై 50 పైసలు, కాంగ్రెస్ గెలుపుపై రూ. 2 బెట్టింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోందని బెట్టింగ్ మార్కెట్లు ఓ అంచనాకు వచ్చేశాయి. అయితే, మెజారిటీకి సంబంధించి మాత్రం కొంచెం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ పనితీరు, ఎన్నికల ప్రచారం, ప్రజల అభిప్రాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న బెట్టింగ్ మార్కెట్లు... విజయం బీజేపీదే అనే నిర్ణయానికి వచ్చాయి.

మొత్తం 182 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 107 నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉందని బెట్టింగ్ మార్కెట్లు అంచనాకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 71 సీట్ల వరకు వచ్చే అవకాశం మాత్రమే ఉందని భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 115 సీట్లు రాగా... కాంగ్రెస్ 68 సీట్లతో సరిపెట్టుకుంది. గుజరాత్ ఎన్నికల్లో ట్రెండ్స్ రోజురోజుకు మారిపోతున్నాయని బుకీలు చెబుతున్నారు. బెట్టింగ్ మార్కెట్లో బీజేపీ గెలుపుపై 50 పైసలు, కాంగ్రెస్ గెలుపుపై రూ. 2 బెట్టింగ్ నడుస్తోంది. బీజేపీ గెలుపుపైనే బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువ పందేలు కాస్తున్నారు. 

gujarat elections
betting on gujarat elections
  • Loading...

More Telugu News