gurunath reddy: అమరావతిలోని అసెంబ్లీ వద్దకు చేరుకున్న గురునాథ్ రెడ్డి!

  • టీడీపీలో చేరనున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి
  • చంద్రబాబు సమక్షంలో చేరిక
  • గురునాథ్ చేరికను వ్యతిరేకిస్తున్న ప్రభాకర్ చౌదరి

వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అనంతపురంలో కీలక నేత గురునాథ్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోవడానికి సర్వం సిద్ధమైంది. కాసేపటి క్రితం ఆయన అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలసి సైకిల్ ఎక్కనున్నారు.

మరోవైపు, గురునాథ్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటుండటాన్ని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ తో చంద్రబాబు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రభాకర్ చౌదరి పట్టు వీడలేదు. దీంతో, వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చంద్రబాబుకు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.

gurunath reddy
prabhakar chowdary
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News