aadi pinisetty: సోలో హీరోగా ఆది పినిశెట్టి .. తాప్సీ హీరోయిన్.. త్వరలో సెట్స్ పైకి!

  • నటుడిగా ఆది పినిశెట్టి బిజీ 
  • కొత్తదనంతో కూడిన పాత్రలకి ప్రాధాన్యత 
  • హరనాథ్ దర్శకత్వంలో హీరోగా 
  • కథానాయికగా తాప్సీ    

దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి, తన టాలెంట్ తో నిలదొక్కుకున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఆయన హీరోగా మాత్రమే చేస్తానని కూర్చోలేదు. అవకాశం వస్తే హీరోగా .. లేదంటే విలన్ గా చేస్తూ, కీలకమైన పాత్రలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నాడు.

 ప్రస్తుతం ఆయన తెలుగులో 'రంగస్థలం' సినిమాలోను .. 'అజ్ఞాతవాసి' సినిమాలోను ముఖ్యమైన పాత్రలను చేస్తున్నాడు. అలాంటి ఆది పినిశెట్టి తెలుగులో హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 'లవర్స్' చిత్రం ద్వారా పరిచయమైన హరనాథ్ .. ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి జోడీగా తాప్సీ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆది పినిశెట్టి చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట.     

aadi pinisetty
tapsee
  • Loading...

More Telugu News