JC diwakar reddy: చంద్రబాబు కనికరిస్తే మావాడు కింగే!: జేసీ దివాకర్ రెడ్డి

  • వాడికి పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆశ
  • బాబు కరుణిస్తే అనంతపురం అభ్యర్థి నా కుమారుడే
  • మీడియాతో జేసీ దివాకర్ రెడ్డి

తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకుకు పార్లమెంట్ కు వెళ్లాలన్న ఆసక్తి ఉందని ఆయన తెలిపారు. ఈ ఉదయం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, " చంద్రబాబు కనికరిస్తే, మా వాడే కింగ్. వాడికి పార్లమెంట్ కు పోటీచేయాలని ఉంది. బాబు కరుణిస్తే, అనంతపురం అభ్యర్థి నా కుమారుడే" అని అన్నారు. "వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయబోవడం లేదు. పార్లమెంట్ లో చేయడానికి ఏముంది?" అని ప్రశ్నించిన జేసీ, ఎంపీలు కరివేపాకుల్లా మారారని, వారిని పలకరించే వారు కూడా ఉండరని చెబుతూనే తన కుమారుడిని ఎంపీ చేయాలని ఉందనడం గమనార్హం.

JC diwakar reddy
JC pavan kumar reddy
Parliament
  • Loading...

More Telugu News