google: గూగుల్ సెర్చ్‌లో కొత్త ట్యాబ్... ఫైనాన్స్ అంశాన్ని జోడించిన గూగుల్
- ఆర్థిక రంగానికి సంబంధించిన వివరాలకు ప్రత్యేకం
- పెరుగుతున్న అవగాహన కారణంగా కొత్త అప్డేట్
- మదుపర్లకు, వ్యాపారవేత్తలకు ఉపయోగం
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇవాళ సరికొత్త ట్యాబ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 'ఫైనాన్స్' పేరుతో నూతన సెర్చ్ ట్యాబ్‌ను సెర్చింగ్ అంశాల్లో జోడించింది. దీని సహాయంతో ఆర్థిక రంగానికి సంబంధించిన వివరాలను, వార్తలను ప్రత్యేకంగా చూపించనుంది. ఆర్థిక రంగం గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా మదుపర్లకు, వ్యాపారవేత్తలకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ ట్యాబ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
ఆర్థిక వేత్తలకు, విశ్లేషకులకు ఉపయోగపడే రిజల్ట్స్ మాత్రమే ఈ ట్యాబ్‌లో కనిపిస్తాయని గూగుల్ పితృసంస్థ ఆల్ఫాబెట్ తన బ్లాగులో పేర్కొంది. నిఫ్టీ, సెన్సెక్స్ డేటాతో పాటు మార్కెట్ స్థితిగతులు, విశ్లేషణలు, సూచనలు ఈ ట్యాబ్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. ఇది డెస్క్‌టాప్‌తో పాటు మొబైల్ సెర్చ్ బార్లో కూడా కనిపిస్తోంది.