burkkha: బురఖా వేసుకుని మహిళా కబడ్డీ ఆటకు వెళ్లేందుకు ప్రయత్నించిన కోచ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-bc8dc06cf77827a02ba73fd2ca0a8fb690b854a0.jpg)
- గుర్తుపట్టిన అధికారులు
- తన టీమ్‌కు సలహాలివ్వడానికి లోపలికి వెళ్లే ప్రయత్నం
- ఆసియన్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో ఘటన
ఇరాన్‌లోని గొర్గాన్లో జరుగుతున్న ఆసియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ మహిళల ఆటను చూసేందుకు థాయ్‌లాండ్ జట్టు కోచ్ ప్రయత్నించాడు. అందుకోసం అతడు బురఖా వేసుకుని స్టేడియం లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నిబంధనల ప్రకారం మహిళలు ఆడుతున్న ప్రదేశానికి మగవాళ్లను, మీడియాను అనుమతించరు. కానీ థాయ్‌లాండ్ జట్టు కోచ్ ఇలా చేయడంపై వారు మండిపడ్డారు. సదరు కోచ్ క్షమాపణలు తెలియజేయాలని కోరారు. అయితే తన జట్టుకి మ్యాచ్ ఆడుతుండగా సలహాలు, సూచనలు ఇవ్వడానికి కోచ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.