sai dharam tej: చంద్రశేఖర్ యేలేటితో సాయిధరమ్ తేజ్!

  • 'మనమంతా'తో మంచి మార్కులు కొట్టేసిన చంద్రశేఖర్ యేలేటి
  • తదుపరి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ తో 
  • సాయిధరమ్ తేజ్ తో సంప్రదింపులు 
  • ఆయన ఓకే చెప్పే ఛాన్స్    

తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన కథలను పరిచయం చేసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. 'ఐతే' .. 'అనుకోకుండా ఒక రోజు' .. 'ఒక్కడున్నాడు' .. 'మనమంతా' సినిమాలు ఆయన అభిరుచికి .. దర్శక ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన సినిమాలు సహజత్వంతో మనసుకు దగ్గరగా ఉంటాయి కానీ, భారీ వసూళ్లను సాధించలేకపోయాయి.

 అందువలన 'మనమంతా' తరువాత ఆయన మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఆయనతో ఒక సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కథానాయకుడిగా సాయిధరమ్ తేజ్ ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. వరుస సినిమాలతో సాయిధరమ్ తేజ్ బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్టుకు కూడా ఆయన ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.     

sai dharam tej
chandrasekhar yeleti
  • Loading...

More Telugu News