BCCI: బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ.. రూ.52 కోట్ల జరిమానా
- క్రికెట్ ప్రసార హక్కుల విషయంలో బీసీసీఐకి ఎదురుదెబ్బ
- నిబంధనలు మార్చడాన్ని తీవంగ్రా ఖండించిన సీసీఐ
- 60 రోజుల్లోపు జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఆదేశం
భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ క్రికెట్ ప్రసార హక్కుల కేటాయింపుల విషయంలో పోటీ మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను కాంపిటిషన్ వాచ్ డాగ్ సీసీఐ రూ.52 కోట్ల (8 మిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
2008 నుంచి ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కలిగి ఉంది. అయితే 2018-22కు గాను స్టార్ ఇండియా 2.55 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఇది గత డీల్‌కు ఏకంగా 150 రెట్లు అదనం. సోనీతో బీసీసీఐ డీల్‌కు సంబంధించి 2013లో విచారణ చేపట్టిన సీసీఐ అది అక్రమమని తేల్చింది. బోర్డు ఆర్థిక, బిడ్డర్ల ప్రయోజనాలు కాపాడడానికి అనుకూలంగా నిబంధనలు పెట్టుకోవడాన్ని కమిషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు 2013-14, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల టర్నోవర్‌లో సగటున 4.48 శాతాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది.