Donald Trump: పాకిస్థాన్ త‌న తీరును మార్చుకోవ‌డం లేదు: అమెరికా ఆగ్ర‌హం

  • ఉగ్రవాదుల నుంచి ఓ జంట‌ను రక్షించేందుకు పాక్‌ సాయం చేసింది
  • పాక్‌-అమెరికా సంబంధాలు మెరుగ‌వుతాయ‌నుకున్నాం
  • కానీ, అటువంటి ప‌రిస్థితులు లేవు
  • మిలిటెంట్‌ గ్రూపులకు పాక్‌ స్వర్గధామంగా మారింది

తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా ఉగ్ర‌వాదుల విష‌యంలో పాకిస్థాన్ త‌మ‌ తీరును మార్చుకోవ‌డం లేద‌ని అమెరికా మ‌రోసారి హెచ్చ‌రించింది. తాజాగా పాక్ తీరుపై యూఎస్‌ ఆర్మీ జనరల్‌ జాన్‌ నికోల్సన్ మాట్లాడుతూ... కొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన అమెరికా-కెనడా జంటను ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల నుంచి రక్షించేందుకు పాకిస్థాన్ సాయం చేసింద‌ని, దీంతో త‌మ‌కు-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని భావించామని తెలిపారు. కానీ, అటువంటి ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేద‌ని చెప్పారు. హ‌క్కానీ నెట్‌వర్క్‌, మిలిటెంట్‌ గ్రూపులకు పాక్‌ స్వర్గధామంగా మారిందని, పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకు హక్కానీ నెట్‌వర్క్‌ మిలిటెంట్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.      

  • Loading...

More Telugu News