rtc: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు .. సెల్ఫీలు తీసుకున్న ప్రయాణికులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c891221f610f3ac0b9372afc48fb12a6285d9b96.jpg)
- శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వరకు ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రయాణం
- బస్సుల వేళల గురించి ఆరా
- బస్సులో నుంచే రోడ్లను పరిశీలించిన ఎంపీ
తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన ప్రయాణం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన బస్సు ప్రయాణికులతో ముచ్చటించారు.
'బస్సులు సరైన వేళలో వస్తున్నాయా? ఆర్టీసీ సేవలు ఎలా ఉన్నాయి?' అని ప్రయాణికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లోని రహదారులను ఆయన బస్సులో నుంచే పరిశీలించారు. పలు బస్టాండ్‌లలో బస్సు ఆగిన వేళ ఆయన కిటికీలోంచి కూడా ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయాణికులు ఆసక్తి చూపారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-b2cdf98efb0f9f9466d5f016af55920f6ed239e0.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-67eaa8753eb52b1f7a63518cfd85f2d8f23b35d5.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/froala-8256e7d0bfa16b6ac15576da62a9e7155146be9e.jpg)