Pakistan: నేను చావలేదు...బతికే ఉన్నాను.. అవన్నీ రూమర్లే!: పాక్ క్రికెటర్

  • బరువు కారణంగా జట్టులో చోటుకోల్పోయిన ఉమర్ అక్మల్
  • ఇస్లామాబాద్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడంటూ వార్తలు
  • బతికే ఉన్నానంటూ ప్రకటన

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో బరువు కారణంగా చోటు కోల్పోయిన ఆల్‌ రౌండర్ ఉమర్ అక్మల్ మరణించాడంటూ గత కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ ఆర్మీకి, ఒక మత సంస్థకి మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఉమర్ అక్మల్ కూడా ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ దాడిలో ఉమర్ అక్మల్ తీవ్రంగా గాయపడ్డాడని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పుకార్లు షికార్లు చేశాయి.

 దీంతో అతని సహచరులు, అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇది తెలుసుకున్న ఉమర్ అక్మల్ సోషల్ మీడియా మాధ్యమంగా తాను క్షేమంగా ఉన్నానని, తనకేమీ కాలేదని...అవన్నీ పుకార్లని చెబుతూ వీడియో ఒకటి అప్ లోడ్ చేశాడు. త్వరలో జరిగే నేషనల్ టీ20 కప్ లో పాల్గొంటానని ఉమర్ అక్మల్ తెలిపాడు. 

Pakistan
umar akmal
pak cricketer
  • Error fetching data: Network response was not ok

More Telugu News