charan: 'రంగస్థలం' రిలీజ్ డేట్ గా మార్చి16 ఖాయమైనట్టే!

  • ముగింపు దశకి చేరుకున్న 'రంగస్థలం'
  • వచ్చేనెలలో పాటల చిత్రీకరణ 
  • సంక్రాంతికి ఫస్టులుక్        

సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. చరణ్ - సమంత జోడీగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. వచ్చే నెలంతా కూడా ఈ సినిమాలోని పాటల చిత్రీకరణపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆ తరువాత మిగతా పనులన్నీ ఫిబ్రవరి నాటికి పూర్తిచేసుకుని, మార్చి 16వ తేదీన సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

ఇక ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పి, ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందువలన ఈ సినిమా ఫస్టులుక్ ను సంక్రాంతికి రిలీజ్ చేసి, అభిమానులు నిరుత్సాహానికి లోను కాకుండా చూడాలని భావిస్తున్నారట. తప్పనిసరిగా ఆ రోజున ఫస్టులుక్ వచ్చేస్తుందనే అంటున్నారు.               

  • Loading...

More Telugu News