Narendra Modi: ఈ లెక్క‌న మోదీ త‌న హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుంది: రాహుల్ గాంధీ చుర‌క‌లు

  • గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోదీపై రాహుల్ విమ‌ర్శ‌లు
  • 2012 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో సీఎం హోదాలో మోదీ హామీ
  • 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన మోదీ
  • ఐదేళ్లలో 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిన బీజేపీ స‌ర్కారు

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోదీపై విభిన్న రీతిలో చుర‌క‌లు అంటిస్తోన్న విష‌యం తెలిసిందే. గుజ‌రాత్‌లో 2012 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న‌ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని రాహుల్‌ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని ఆ ఎన్నిక‌లప్పుడు మోదీ హామీ ఇచ్చార‌ని, మేనిఫెస్టోలో కూడా ఈ హామీని పెట్టారని తెలిపారు. గత ఐదేళ్లలో ఆ రాష్ట్ర స‌ర్కారు 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని, ఈ లెక్క ప్ర‌కారం బీజేపీ హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుందని చుర‌క‌లంటించారు.

  • Loading...

More Telugu News