jeevan akshay: త్వరలో 'జీవన్ అక్షయ్' పాలసీని నిలిపివేస్తున్న ఎల్ఐసీ
- భారీగా పడిపోతున్న వడ్డీరేట్లే కారణం
- త్వరలో కొత్త రేట్లతో పునఃప్రారంభం
- అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీ ఇది
అత్యంత ప్రజాదరణ పొందిన 'జీవన్ అక్షయ్' పాలసీ అమ్మకాలను డిసెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రముఖ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ తెలిపింది. వడ్డీరేట్లు భారీగా పడిపోతున్న కారణంగా పాలసీని కొనసాగించడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇదే పాలసీని 6-6.5 శాతం వడ్డీరేటుతో పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఎల్ఐసీలో నాలుగో వంతు వ్యాపారం 'జీవన్ అక్షయ్' ద్వారానే జరిగింది. సింగిల్ ప్రీమియం ప్లాన్‌తో దీని ద్వారా ఈ ఏడాది రూ.10వేల కోట్ల ఆదాయం రాగా, గత రెండేళ్లలో రూ.22వేల కోట్లు సంపాదించింది. జీవన్ అక్షయ్ అత్యధికంగా 7.5శాతం వడ్డీని ఇస్తోంది.