Amitabh Bachchan: 'అక్షయ్! నువ్వలా చేయకుండా ఉండాల్సింది' చిరు కోపం ప్రదర్శించిన అమితాబ్!

  • అమితాబ్ ను వరించిన 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు
  • అమితాబ్ కు అవార్డు అందజేసిన స్మృతి ఇరానీ, అక్షయ్ కుమార్
  • అక్షయ్ పై చిరుకోపం ప్రదర్శించిన అమితాబ్

గోవాలో జరిగిన ఐఫీ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డును అమితాబ్ కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అక్షయ్ కుమార్ అందజేశారు.

అవార్డు ఇవ్వడానికి ముందు ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ... 'అమెరికాకి సూపర్ మ్యాన్ ఉంటే.. ఇండియాకి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నారు' అంటూ అక్షయ్ కుమార్ పేర్కొంటూ బిగ్ బీని వేదికపైకి రావాలని కోరారు. అమితాబ్ వేదికపైకి రాగానే ఆయన కాళ్లకు అక్షయ్ నమస్కారం చేసేప్రయత్నం చేశాడు.

వెంటనే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్న అమితాబ్ అతనిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన బిగ్ బి అక్షయ్ పై ప్రేమపూర్వక చిరుకోపం ప్రదర్శించారు. 'అక్షయ్! నువ్వలా చేసి ఉండాల్సింది కాదు. నాకు చాలా ఇబ్బంది కలిగింది' అంటూ పేర్కొన్నారు. 

Amitabh Bachchan
akshay kumar
smriti irani
iifa
  • Error fetching data: Network response was not ok

More Telugu News